![]() |
![]() |

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి''(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -820 లో....దుగ్గిరాల ఇంట్లో వినాయకుడి పూజకి ఏర్పాట్లు చేస్తారు. రేవతి ఇంటిముందుకు వచ్చి రాజ్ కి కాల్ చేస్తుంది. దాంతో కావ్యని తీసుకొని రాజ్ బయటకు వెళ్తాడు. రేవతి ముసుగు వేసుకొని ఉంటుంది. కావ్యని ఆటపట్టింద్దామని.. తను నా క్లాస్ మేట్ అని రాజ్ చెప్పగానే మొన్నటి వరకు యామిని ఇప్పుడు తనా అని ముసుగులో ఉన్న రేవతిని తిడుతుంది కావ్య.
ముసుగు తీసి చూస్తే రేవతి ఉంటుంది. తను చూసి సారీ వదిన అని కావ్య అంటుంది. దాంతో రాజ్ నవ్వుతాడు. రేవతి ఇంట్లోకి రావడానికి బయపడుతుంది కానీ తీసుకొని వస్తారు. స్వరాజ్ లోపలికి పరిగెత్తుకొని వెళ్తాడు. అతన్ని చూసి అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్వరాజ్ వాళ్ళ అమ్మ గారు అని రేవతిని ఇంట్లో అందరికి పరిచయం చేస్తాడు రాజ్. ముసుగు ఎంటి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వాళ్ళ ఆచారం పిన్ని అని రాజ్ కవర్ చేస్తాడు. నేను ఎక్కడ ఇలాంటి ఆచారాలు చూడలేదు అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత పూజ మొదలవుతుంది. సీతారామయ్య దగ్గరికి రేవతిని తీసుకొని కావ్య, రాజ్ వెళ్తారు.
రేవతితో సీతారామయ్య మాట్లాడుతుంటే అప్పుడే ఇందిరాదేవి వచ్చి మీరేం చేస్తున్నారు.. ఈ అమ్మాయి ఎవరు.. స్వరాజ్ వాళ్ళ అమ్మనా అని అడుగుతుంది. మీ మనవరాలు రేవతి అని కావ్య అంటుంది. రేవతిని చూసి ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. ఈ విషయం అపర్ణకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది. అక్కని మేమ్ ఈ కుటుంబానికి దగ్గర చేస్తామని రాజ్ అనగానే మేమ్ కూడా అని అప్పు, కళ్యాణ్, స్వప్న అంటారు. తరువాయి భాగంలో ఈ స్వరాజ్ ఎవరో కాదు ఈ ఇంటికి వారసుడు రేవతి కొడుకు అని ఇంట్లో అందరి ముందు రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |